వైన్స్‌లో భారీ చోరీ రూ.18లక్షల నగదు అపహరణ


Tue,November 12, 2019 02:01 AM

హిమాయత్‌నగర్ : ఓ వైన్స్ దుకాణం వెనుక గోడకు రంధ్రం చేసి .. రూ.18లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ సంఘటన నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ రమేష్‌కుమార్ కథనం ప్రకా రం.. బంజారాహిల్స్‌లో నివాసం ఉండే మన్‌మిసింగ్ హిమాయత్‌నగర్ ప్రధాన రహదారి సమీపంలోని ఓ భవనం సెలార్‌లో కులదీప్ పేరుతో వైన్స్‌షాపు ఏర్పాటు చేశాడు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో వైన్స్ షాపుకు తాళం వేసి సిబ్బంది వెళ్లి పోయారు. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు వైన్స్ వెనుకగోడకు రంధ్రంచేసి లాకర్‌ను పగుల గొట్టి .. రూ.18లక్షల నగదును దోచుకెళ్లారు. సోమవారం ఉదయం సిబ్బంది చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు గోడకు రంధ్రం చేసి లోపలికి వచ్చిన దృశ్యాలు కన్పించాయి. ఆ భవనానికి పనిచేసే వాచ్‌మన్ ఇంట్లో మూడు బీర్‌సీసాలతో పాటు లాకర్ లభ్యం కావడం తో పాటు అతను కన్పించకపోవడంతో అతనే చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి.. అతని కోసం గాలిస్తున్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...