వివాహం... విషాదం


Mon,November 11, 2019 12:42 AM

-పెండ్లి ప్రాంగణాల్లో మృత్యు ఘోష
-ఉసురు తీసిన నిర్లక్ష్యపు నిర్మాణం
-గోల్నాకలో గోడ కూలి నలుగురి దుర్మరణం
-కాసేపట్లో పెండ్లి.. వరుడి ఆత్మహత్య
-ఫంక్షన్ హాల్‌లోనే ఉరివేసుకున్న పెండ్లి కొడుకు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పాత భవనాలు, నాణ్యత నిర్మాణాలు ప్రాణాలు తీస్తున్నాయి. అదివారం అంబర్‌పేట గోల్నాకలోని పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ గోడకూలిన ఘటనలో నలుగురు మృత్యువాత పడగా పలువురికి గాయాలయ్యాయి. వివాహ వేడుక జరిగిన సందర్భంగా ఈ ఘటన జరుగడంతో విషాదం నెలకొంది. కాగా జీహెచ్‌ఎంసీ దృష్టికి వచ్చిన చాలా పాత భవనాలను కూల్చివేసింది. సంఘటన జరిగిన విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి మృతుల కుటుంబాలను పరమర్శించారు. కాగా బాధితులకు రెండు లక్షల పరిహారం మేయర్ ప్రకటించారు.

నిబంధనలు గాలికి
నిబంధనల ప్రకారం ప్రహరీ నిర్మించాలన్న, ఎటువంటి నిర్మాణం చేయాలన్న మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి పొందడం తప్పనిసరి. అయితే నగరంలో అనుమతులు తీసుకోకుండా కొందరు నిర్మాణాలు చేపడుతున్నారు. ఆదివారం జరిగిన ఘటన కూడా ఇదే కోవలోనిదే. ఇక్కడ సరైన డిజైన్, ఇంజినీరింగ్ నైపుణ్యాలు కొరవడటం వల్లే ప్రమాదం జరిగిందని నిపుణులు చెబుతున్నారు. సీతాఫల్‌మండిలో శిథిల భవనం కూలి బాలుడు మృతి చెందినప్పుడు జీహెచ్‌ఎంసీ సీరియస్‌గా తీసుకుంది. ఐనప్పటికీ పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. ఏదైనా భవనం కూలితే యజమానులను జైలుకు పంపిస్తామని చెప్పినా స్పందన కరువైంది

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles