రైతు సంక్షేమమే ధ్యేయం


Sun,November 10, 2019 02:23 AM

కంటోన్మెంట్, నమస్తే తెలంగాణ: రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సూచించారు. శనివారం ప్రగతి భవన్‌లో ఎమ్మెల్సీ శంభీర్‌పూర్ రాజు, టీఆర్‌ఎస్ నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిలతో కలిసి బోయిన్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టి.ఎన్.శ్రీనివాస్ మంత్రి కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ శ్రీనివాస్‌ను అభినందించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరుగాలం రైతన్నలు శ్రమించి పండించిన తమ పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయించేందుకు మార్కెటింగ్ యంత్రాంగం అన్ని వసతులు కల్పించాలని సూచించినట్లు శ్రీనివాస్ తెలిపారు. దళారి వ్యవస్థను నిర్మూలించాలని కేటీఆర్ సూచించినట్లు పేర్కొన్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles