నీరాతో ఆరోగ్యానికి ఎంతో మేలు


Sat,November 9, 2019 01:13 AM

-సుందరయ్య పార్కు వద్ద ఉచితంగా పంపిణీ
చిక్కడపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీరా చట్టం తెచ్చిన సందర్భంగా గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య పార్కు వద్ద ఉచితంగా నీరా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్ మాట్లాడుతూ నీరా చట్టం తేవడం వల్ల ఎంతో మంది గీత కార్మికులకు ఉపాధి దొరుకుతుందన్నారు. కార్మికుల పక్షపాతి అయిన సీఎం కేసీఆర్‌కు గీత కార్మికులు రుణపడి ఉంటారన్నారు. నీరాలో ఎన్నో షోషక విలువలు ఉంటాయన్నారు. ఈ ఆధునిక కాలంలో ఆరోగ్యానికి నీరా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మధుమేహం, బీపీ, కిడ్నీ నీరసం, పోషక ఆహార లోపం ఉన్న వారికి నీరా ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గడ్డమీద విజయ్‌కుమార్ గౌడ్, బబులు, రాజేంద్రప్రసాద్ గౌడ్, శ్రీనివాస్‌ప్రసాద్ గౌడ్, కొప్పుల రవీందర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఉడుతల బాలకృష్ణ గౌడ్, వెంకటేశ్, అజయ్, దేవరాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...