ముంబైలో మన ఫీడ్ ద నీడ్ ఫ్రిజ్


Sat,November 9, 2019 01:09 AM

హైదర్‌నగర్ : అన్నార్థుల ఆకలి తీర్చేందుకు బల్దియాలోనే తొలి సారిగా వెస్ట్ జోన్‌లో ఏర్పాటు చేసిన ఫీడ్ ద నీడ్ ఫ్రిజ్ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే ఇక్కడి వినూత్న ఆలోచనను మద్రాసులో ఏర్పాటు చేయగా, తాజాగా ముంబైలో అంథేరీ ప్రాంతంలో అంథేరీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇదే తరహాలో ఫ్రిజ్‌ను ఏర్పాటు చేశారు. తమ ఆవాసాల్లోని మిగిలిన పదార్థాలను వాటిల్లో నిల్వ చేయడమే కాకుండా...హోటళ్లు, కాలనీల నివాసితులు తమ వద్ద మిగులుగా ఉన్న ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో నిల్వ చేయాలని అంథేరీ రెసిడెంట్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. స్పందించిన పలువురు ముందుకు వచ్చి ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో పెడుతున్నట్లు ప్రతిష్టాత్మక ఏఎన్‌ఐ వార్తా సంస్థ తన ట్వీట్‌లో పేర్కొన్నది. కాగా, ఫీడ్ ద నీడ్ ఫ్రిజ్‌ల ఆలోచన ఇతర రాష్ర్టాలను ప్రభావితం చేసి, ఏర్పాటు చేస్తుండటం పట్ల వెస్ట్ జోనల్ కమిషనర్ దాసరి హరిచందన సంతోషం వ్యక్తం చేశారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...