హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అసెంబ్లీ ఆవరణలో ఆధునీకరించిన ఎస్బీఐ కార్యాలయాన్ని శుక్రవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీ ఆవరణలోని ఎస్బీఐ గతంలో సచివాలయ ఎస్బీఐకి ఎక్స్టెన్షన్ బ్రాంచీగా ఉండేది. తాజాగా దీనికి బ్రాంచ్ హోదా కల్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ..ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఖాతాదారులకు సేవలందించాలని ఎస్బీఐ సిబ్బందికి సూచించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన శానంపూడి సైదిరెడ్డికి బ్యాంక్ సిబ్బంది అకౌంట్ ఇవ్వగా, స్పీకర్ ఆయనకు పాస్‌బుక్ అందజేశారు. కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, అసెంబ్లీ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్.భాస్కర్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, ఎస్బీఐ సీజీఎం ఓంప్రకాశ్ మిశ్రా పాల్గొన్నారు.