ప్రజల పక్షాన గొంతెత్తిన కవి ‘గోరటి’


Wed,November 6, 2019 01:04 AM

తెలుగుయూనివర్సిటీ: ప్రపంచ సాహిత్యంలో పాటకి మొదటి స్థానం ఇవ్వటానికి మేధా వులు, విమర్శకులు వెనుకాడారు అని అమెరికన్‌ ప్రజా వాగ్గేయకారుడు బాబ్‌ డిలాన్‌కి నోబెల్‌ అవార్డు వచ్చాక ఆ రేఖ చెరిగిపోయిందని సరస్వతి సమ్మాన్‌ అవార్డు గ్రహీత కె. శివారెడ్డి అన్నారు. ప్రముఖ గేయ రచయిత గోరటి వెంకన్న రచించిన వల్లంకి తాళం, పూసిన పున్నమి పుస్తకాల ఆవిష్కరణ సభ నాంపల్లిలో గల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యా లయం ఆడిటోరియంలో మంగళవాం సాయంత్రం జరిగింది. గొప్ప వాగ్గేయకారులు స్మరణలోకి వచ్చినప్పుడు గోరటి వెంకన్న గుర్తుకు వస్తాడని శివారెడ్డి అన్నారు. గొప్ప వాగ్గే యకారుల సాహిత్యం అన్ని భాషలలో జీవం పోసుకుందన్నారు. ప్రజాజీవన లోతులను, దుఃఖాలను, ఆనందాన్ని, వెతలను, హింసల్ని, పీడలను, ఈ వాగ్గేయకారులు అద్భుతంగా పట్టుకుని స్థిరసాయిల్ని కల్పించారని శివారెడ్డి పేర్కొన్నారు. వివక్షలను, అన్యాయాలను, దోపిడీలను, బెరుకులేకుండా రాజ్యానికి భయపడకుండా గొంతెత్తి చాటారని గుర్తు చేశారు. దుఃఖపు లోతులనుండి విశ్వగీతాన్ని, ఒక విశ్వగానాన్ని సృజించారన్నారు. జీవన ఆనం దాన్ని, దుఃఖాన్ని పాట బ్రహ్మాండంగా పట్టుకుందన్నారు. బతుకును పాట సెలబ్రేట్‌ చేసిం దన్నారు. తన్మయత్వంతో ఊగిపోయి సర్వప్రాణి కోటి సంతోషాలను, వెతలను, అవధులు లేని ఆశలను అది అందుకుని విశ్వాన్ని వెలిగించింది అని వివరించారు. పాటలు విన్నాక ఒక సమరోత్సాహం, ఒళ్ళు తెలియని అనంతమయమైన ఉబుకుతుందన్నారు. వెంకన్న పాటలు బతుకు పట్ల ఆశను, జీవితం పట్ల రుచిని, ఎక్కడా నిరాశకుగానీ, నిర్వేదానికి గానీ చోటులేకుండా ప్రజాజీవనంలో చైతన్యాన్ని కలిగిస్తాయన్నారు.

తెలంగాణమీడియా అకా డమీ చైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి వెంకన్న పాటలు ప్రజ లను ఉత్తేజపరిచాయన్నారు. వెంకన్న పాట, ఆట ప్రజలను ఉద్యమం వైపు ఉర్రూ తలూగించాయన్నారు. కవిత్వం తన తత్వంతో సజీవంగా ఉంటుందన్నారు. ప్రముఖ నటులు, రచయిత ఆర్‌. నారాయణమూర్తి మాట్లాడుతూ వెంకన్న వంటి గొప్ప కవికి పద్మ విభూషణ్‌కు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి గౌరవించు కోవాలని ఆకాంక్షించారు. ప్రముఖ సాహితీవేత్త ఖాదర్‌ మొహియుద్దీన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకులు కె. శ్రీనివాస్‌, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి, కన్నడ సాహితీవేత్త ప్రొఫెసర్‌ హెచ్‌.ఎస్‌ శివప్రకాష్‌, సాహితీవేత్తలు శిలా లోలిత, అట్టాడ అప్పల్నాయుడు, బండి నారాయణ స్వామి, డాక్టర్‌ జె. చెన్నయ్య, దేవి ప్రియ, క్రాంతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని గోరటి వెంకన్న వ్యక్తిత్వాన్ని, రచనా శైలిని కొనియాడారు.

19
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...