స్నేహభావంతో ఉత్సవాలు నిర్వహించాలి


Wed,November 6, 2019 01:03 AM

చార్మినార్‌: ఆత్మజ్ఞానంతో వేడుకలను నిర్వహించినప్పుడే ఇతర మతాలనూ అభిమానంచగలమని నగర పోలీస్‌కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. మంగళవారం సాలార్జింగ్‌ మ్యూజియంలో మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా వివిధ వర్గాల ముస్లిం మతపెద్దలతో పోలీస్‌ ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో నగర పోలీస్‌ కమిషనర్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్సవాలు ప్రశాంతతకు చిహ్నంగా భావించినప్పుడే వాటి ని మతసామరస్యంగా జరుపుకోగలమని సూ చించారు. ప్రస్తుతం నగరంలో నెలకొన్న శాంతియుత వాతావరణం కారణంగా ప్రపంచ ప్రఖ్యా తిగాంచిన పలు విధాల కంపెనీలు తమ కార్యకలపాలను నగరం నుంచి ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నాయని తెలిపారు. దేశంలోని ఇతర మెట్రో నగరాకంటే ధీటైన పోలీసు విధంనంతో నేరాల సంఖ్యతోపాటు శాంతియుత వావరణానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రశాం త నగరంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఏ మత ఆచార వ్యవహారాలైన మరమతంపై విషాన్ని చిమ్మే విధంగా వ్యవహరించాలని ఉద్బోధించడం లేదన్నారు. అలాంటి సందర్భాల్లో ఇతర వర్గీయుల వారికి సైతం సమ ప్రాధాన్యత కల్పిస్తూ వారితో సుహృద్భావ వాతావరణంతో వ్యవహరించినప్పుడు అంతే ప్రధాన్యతను తిరిగి పొందగలమని సూచించారు. ఉత్సవాల పేరుతో ఇతర మతస్తులపై లేనిపోని అపోహలు సృష్టించుకుంటూ సామరస్య వాతా వరణానికి భంగంకలిగించకుండా వ్యవహరించాలని ఇరువర్గాల వారికి సీపీ సూచించారు. మహ్మద్‌ ప్రవక్త ప్రపంచానికి ఖురాన్‌ను అందించిన రోజుగా గుర్తించుకుంటూ ముస్ల్లింలు మిలా ద్‌ ఉన్‌ నబీ పర్వదినాన్ని జరుపుకుంటారని తెలిపారు.

ఖురాన్‌ ప్రపంచానికి శాంతి సందేశాలను అందించే గ్రంథంగా గుర్తిస్తూ మతాచారాలను పాటించే ప్రతిఒక్కరూ శాంతియుతంగా ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవడానికి ప్రయత్నించాలని తెలిపారు. దైవసన్నిధికి సమీపంలోకి వెళ్లాలంటే మనలోని కొన్ని దుర్గుణాలను త్యా గం చేసి ఉన్నతస్థితికి చేరుకోవడానికి ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కమిషన్‌ చార్మన్‌ కమ్రుద్దీన్‌తోపాటు పవురు మతపెద్దలు, అదనపు కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌, ట్రాఫిక్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, సం యుక్త కమిషనర్‌ తరుణ్‌జోషి, దక్షిణ మండల ఇన్‌చార్జ్జి డీసీపీ అవినాష్‌మహంతి, ట్రాఫిక్‌ డీసీ పీ బాబురావుతోపాటు అడిషనల్‌ డీసీపీ రఫీక్‌, ఏసీపీలు అంజయ్య, ఆనంద్‌, సుధాకర్‌, తిరుపతన్న, మాజీద్‌, శివరామశర్మ, పలు పోలీస్‌ స్టేషన్లకు చెందిన ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు పా ల్గొన్నారు.

19
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...