ఐటీ..ట్రాఫిక్ ఫ్రీ..


Tue,November 5, 2019 03:05 AM

-హైటెక్‌సిటీలో రెండు ైఫ్లెఓవర్లకు శంకుస్థాపన
-బయోడైవర్సిటీ పైవంతెన ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి
-అన్నిైఫ్లెఓవర్లు అందుబాటులోకి వస్తే తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తదితర ప్రాంతాలతో కూడిన ఐటీజోన్‌లో ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా నిర్మించిన బయోడైవర్సిటీ సెకెండ్ లెవెల్ ైఫ్లెఓవర్‌ను ప్రారంభించడంతోపాటు అదే ప్రాంతంలో మరో రెండు ైఫ్లెఓవర్లకు పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, విద్యాశాఖమంత్రి సబితా రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులతోపాటు మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, కమిషనర్ లోకేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

బయోడైవర్శిటీ ైఫ్లెఓవర్‌పై రాకపోకలు షురూ
గచ్చిబౌలి వద్ద బయోడైవర్శిటీ సెకెండ్‌లెవెల్ ైఫ్లెఓవర్‌ను ప్రారంభించడంతో పాటు అదే ప్రాంతంలో రూ.330కోట్లతో కొండాపూర్ వైపునుంచి గచ్చిబౌలి జంక్షన్ మీదుగా ఓఆర్‌ఆర్ వైపు వెళ్లేందుకు ఆరులేన్ల ైఫ్లెఓవర్, అలాగే, శిల్పాలేఔట్ వైపునుంచి ఓఆర్‌ఆర్‌వైపు గచ్చిబౌలి జంక్షన్ వరకు నాలుగులేన్ల ైఫ్లెఓవర్ నిర్మాణానికి మంత్రులు భూమి పూజ చేశారు. మూడు లేన్లుగల బయోడైవర్సిటీ సెకెండ్ లెవెల్ ైఫ్లెఓవర్‌ను రూ.69.47కోట్లతో నిర్మించగా, దీనివల్ల మెహిదీపట్నం వైపునుంచి మైండ్‌స్పేస్, హైటెక్‌సిటీ వైపు వెళ్లే ట్రాఫిక్‌కు ఎంతో మేలు కలుగుతుంది. సోమవారం ఈ ైఫ్లెఓవర్‌పై నుంచి ట్రాఫిక్‌ను అనుమతించారు.

ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం
శిల్పా లేఔట్ రోడ్డు మార్గంలో ప్రస్తుతం గంటకు 1464వాహనాలు నడుస్తుండగా, 2040నాటికి వాటి సంఖ్య 5194కు పెరుగుతుందని అంచనా. గచ్చిబౌలి జంక్షన్‌లో ప్రస్తుతం గంటకు 9806వాహనాలు నడుస్తుండగా, 2036నాటికి వీటి సంఖ్య 17711కు చేరుతుందని అంచనా. ఈ ైఫ్లెఓవర్ల నిర్మాణంతో గచ్చిబౌలి జంక్షన్‌లో ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ల మధ్య కనెక్టివిటీ మెరుగుపడడంతో పాటు ఇంధనం, అలాగే సమయం ఆదా అవుతుంది. కాలుష్యం కూడా గణనీయంగా తగ్గే అవకాశముంది. ప్రమాదాలు తగ్గడమే కాకుండాపాదచారుల రాకపోకలు మెరుగవుతాయి.

బయోడైవర్సిటీైఫ్లెఓవర్‌తో ఉపయోగాలు
మెహిదీపట్నం వైపునుంచి మైండ్‌స్పేస్ వెళ్లే ట్రాఫిక్‌కు బయోడైవర్సిటీ సెకెండ్ లెవల్ ైఫ్లెఓవర్‌వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ముఖ్యంగా పాత ముంబాయి హైవే మార్గంలోని మెహిదీపట్నం వైపునుంచి హైటెక్‌సిటీ మైండ్‌స్పేస్ వరకు సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థకు మార్గం సుగమం అయ్యింది. మైండ్‌స్పేస్ జంక్షన్, అయ్యప్ప సొసైటీ జంక్షన్, రాజీవ్‌గాంధీ జంక్షన్‌ల ైఫ్లెఓవర్లు ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి రావడంతో తాజా ైఫ్లెఓవర్‌వల్ల బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి జేఎన్‌టీయూ వరకు వాహనాల రాకపోకలకు ఎంతో వెసులుబాటు కలిగినట్లు చెప్పవచ్చు.

రూ. 25వేలకోట్లతో ఎస్‌ఆర్‌డీపీ పనులు
నగరంలో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టును చేపట్టిన విషయం విధితమే. ఇందులో భాగంగా మొదటిదశలో రూ.5000 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టగా, అందులో రూ.3000 కోట్ల పనుల్లో కొన్ని పూర్తికాగా, మరికొన్ని వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇవికాకుండా మరో రూ.2000కోట్ల పనులు ఇంకా మొదలుకావాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.600కోట్లతో ఎనిమిది ప్రాజెక్టులను పూర్తిచేశారు. అందులో సోమవారం ప్రారంభించిన బయోడైవర్సిటీ సెకెండ్‌లెవల్ ైఫ్లెఓవర్‌తోపాటు మైండ్‌స్పేస్ అండర్‌పాస్, చింతలకుంట అండర్‌పాస్, అయ్యప్ప సొసైటీ అండర్‌పాస్, మైండ్‌స్పేస్ ైఫ్లెఓవర్, రాజీవ్‌గాంధీ ైఫ్లెఓవర్, నాగోలు కామినేని ఎడమవైపు ైఫ్లెఓవర్, ఎల్బీనగర్ ఎడమవైపు ైఫ్లెఓవర్ తదితర ప్రాజెక్టులు ఉన్నాయి.

మార్చిలోగా మరో నాలుగు రెడీ
ఇప్పటికే ఎనిమిది ప్రాజెక్టులు అందుబాటులోకి రాగా, వచ్చే మార్చిలోగా మరో నాలుగు ప్రాజెక్టులు సిద్ధమవుతాయని జీహెచ్‌ఎంసీ చీఫ్ ఇంజినీర్ శ్రీధర్ తెలిపారు. బైరామల్‌గూడ ఎడమ వైపు ైఫ్లెఓవర్, కామినేని కుడివైపు ైఫ్లెఓవర్, రూ.184కోట్లతో నిర్మిస్తున్న దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, ఎల్బీనగర్ అండర్‌పాస్ తదితర ప్రాజెక్టులు ఇందులో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే, బయోడైవర్సిటీ మొదటి లెవల్ ైఫ్లెఓవర్ నిర్మాణం కూడా మురమ్మరంగా సాగుతున్నట్లు, వచ్చే జూన్‌నాటికి ఇదికూడా పూర్తిచేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్ నం-45 ైఫ్లెఓవర్‌కు కూడా భూసేకరణ సమస్యలు త్వరలో తీరిపోయే అవకాశముందని, ఇది పూర్తయితే, జూబ్లీహిల్స్ రోడ్ నం-45నుంచి దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా ఇనార్బిట్ మాల్ వరకు ట్రాఫిక్‌కు ఎంతో మేలు కలుగుతుందని శ్రీధర్ వివరించారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...