భవన నిర్మాణ వ్యర్థాలు రోడ్లపై పోస్తే కఠిన చర్యలు


Tue,November 5, 2019 03:00 AM

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి:భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై, కాలనీల్లో, ప్రభుత్వ ఖాళీ ప్రదేశాల్లో పోస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డా. ఎంవీ రెడ్డి హెచ్చరించారు. కొందరు భవన నిర్మాణ నిర్మాణ యజమానులు నిర్మాణ వ్యర్థాలు ఇష్టారాజ్యంగా వేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు నిర్మాణ వ్యర్థాలను రోడ్లపక్కన పోయవద్దని, క్వారీలను గుర్తించి అక్కడ పోయాలన్నారు. నిర్మాణ వ్యర్థాలను నిత్యం పోస్తున్న ప్రాంతాలను గుర్తించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. నిర్మాణ వ్యర్థాలను మోసుకువచ్చే లారీలను గుర్తించి వారికి నిబంధనల మేరకు జరిమానాలను విధించాలని జిల్లా రవాణా శాఖ, మున్సిపల్ అధికారులకు సూచించిన కలెక్టర్ నిర్మాణ వ్యర్థాల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...