సమస్యలపై ప్రజావాణిలో ప్రజల మొర


Tue,November 5, 2019 02:59 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి జేసీ జీ. రవి అర్జీలను స్వీకరించారు. వారాసిగూడకు చెందిన ఖాజాబీకి 2015లో వివాహం కాగా షాదీముబారక్ కోసం దరఖాస్తు చేసుకోగా, ఇంత వరకు సాయమందలేదని జేసీని విన్నవించుకుంది. ఇప్పటి వరకు స్వీకరించిన వాటిలో 86 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటన్నింటిని పరిష్కరించి ఆన్‌లైన్‌లో రిపోర్టులను ఆప్‌లోడ్ చేయాలన్నారు. ఆర్డీవోలు శ్రీనివాస్‌రెడ్డి, రాజాగౌడ్, సీపీవో రామభద్రం, బీసీ సంక్షేమాధికారి విమలాదేవి, ఎస్సీ కార్పొరేషన్ డీడీ మాన్యానాయక్, ఎల్‌డీఎం శ్రీనివాస్, ఏవో అశోక్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- శ్రీకృష్ణానగర్‌క చెందిన మల్లికార్జున్ తాను వికలాంగుడినని, తాను అద్దె ఇంట్లో ఉంటూ ఆర్థిక ఇబ్బందులతో పాటు, గుండెజబ్బుతో బాధపడుతున్నానని, తనకు ఇంటిని మంజూరుచేయాలని కోరుతూ అభ్యర్థించాడు.
- 70 ఏండ్ల వయస్సులో తాను ఎలాంటి ఆధారంలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని, ప్రభుత్వం అందించే వృద్ధాప్య పింఛను మంజూరుచేయాలని దరఖాస్తు సమర్పించాడు.

ప్రజావాణికి జిల్లా అధికారులు హాజరుకావాలి
మేడ్చల్ కలెక్టరేట్: ప్రజావాణికి జిల్లా అధికారులు, కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు విధిగా హాజరుకావాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ప్రజావాణిలో పలు సమస్యలపై మొత్తం 60 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్‌వో మధుకర్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...