స్పెషల్‌డ్రైవ్‌కు విశేష స్పందన


Tue,November 5, 2019 02:58 AM

-రెండు రోజుల్లో 42 మెట్రిక్ టన్నులకుపైగా సేకరణ
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఇండ్లలోని పనికిరాని వస్తువులను సేకరించేందుకు జీహెచ్‌ఎంసీ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌కు విశేష స్పందన లభిస్తోంది. గత ఆదివారం ఈ డ్రైవ్ ప్రారంభం కాగా, రెండురోజుల్లోనే 42 టన్నులకుపైగా వ్యర్థాలను సేకరించారు. అత్యధికంగా ఇరిగిపోయిన ఫర్నీచర్, పాడైపోయిన పరుపులు ఎక్కువగా ఉండడం విశేషం. మేయర్ బొంతు రామ్మోహన్ సోమవారం ఖైరతాబాద్ సర్కిల్ సోమాజిగూడలోని దుర్గానగర్‌లో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో పాల్గొన్నారు.

సేకరించిన వ్యర్థాలు(మెట్రిక్ టన్నుల్లో)...
ఎలక్ట్రానిక్ వస్తువులు- 2.027- విరిగిన ఫర్నీచర్- 14.485
పాత పరుపులు, మెత్తలు- 11.281-ప్లాస్టిక్ వ్యర్థాలు- 3.329
హానికారక వస్తువులు- 0.010- ఇతర వస్తువులు-11.399, మొత్తం-42.336

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...