డ్రైవర్ ఎంపవర్‌మెంట్‌కు మైనార్టీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం


Tue,November 5, 2019 02:58 AM

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: మైనార్టీ యువకులు డ్రైవర్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రాం కింద దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీల అభివృద్ధి శాఖ అధికారి ఒక ప్రకటనలో సూచించారు. మారుతీ మోటర్స్, ఊబర్ సంస్థలతో కలిసి మేడ్చల్ జిల్లాలో పని చేయుటకు ఆసక్తి ఉన్న యువత తమ తమ దరఖాస్తులను సమర్పించాలని ఆమె సూచించారు. ఇందులో ముస్లిం, సిక్కులు, బౌద్ధలు, జైనులు, పార్శిలు ఈ పథకానికి దరఖాస్తులు చేయాలని ఆమె సూచించారు.

మారుతీ డ్రైవింగ్ స్కూల్ ద్వారా డ్రైవింగ్‌లో నైపుణ్యత కల్పించడంతో పాటు ఊబర్ సంస్థలో ప్లేస్‌మెంట్లు కల్పిస్తారని, అలాగే రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. 21 నుంచి 40 ఏండ్లలోపు వయసున్న యువతతో పాటు వారి కుటుంబ వార్షిక ఆదాయం (గ్రామాల్లో రూ.1.50లక్షల, పట్టణ ప్రాంతాల్లోని వారి రూ.2లక్షల)ల్లోపు ఉండాలని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు tsobmms.cgg.gov.in అనే వెబ్‌సైట్‌లో ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తులను సమర్పించాలని, పూర్తి వివరాలకు 9000168256 నంబరులో సంప్రదించాలని సూచించారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...