పిల్లలకు కరాటేలో ప్రావీణ్యం కల్పించాలి


Tue,November 5, 2019 02:57 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: చిరు ప్రాయం నుంచే తమ పిల్లలకు కరాటేలో ప్రావీణ్యం కల్పించాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అలీపురం వెంటేశ్వర్‌రెడ్డి అన్నా రు. చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్‌లో జాతీయ షోటోకాన్ చాంపియన్‌షిప్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు చదువుతో పాటు కరాటే సమయాన్ని కేటాయించే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని ఆయన అన్నారు. కరాటే విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని తెలంగాణ షొట్‌కాన్ కరాటే ప్రధాన కార్యదర్శి పైనం సాహాదేవ్ అన్నారు. ఓవరాల్ టీమ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను తెలంగాణ రాష్ట్ర జట్టు దక్కించుకోగా, మహారాష్ట్ర, పంజాబ్ జట్లు రెండు మూడు స్థానాల్లో నిలిచాయి.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...