డ్యూటీకి రెడీ


Mon,November 4, 2019 02:39 AM

-విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులు
-సీఎం ప్రకటనతో డిపోలకు కండక్టర్లు, డ్రైవర్లు
-నేడు పెద్ద ఎత్తున విధుల్లో చేరే అవకాశం!

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మాటతో టీఎస్‌ఆర్టీసీ కండక్ట ర్లు, డ్రైవర్లు విధుల్లో చేరేందుకు కదిలివస్తున్నా రు. ప్రకటన చేసిన 12 గంటల్లోనే స్పందించిన కార్మికులు డిపోలకు పయనమై స్వచ్ఛందంగా విధుల్లో చేరుతున్నారు. యూనియన్ నేతలు సమ్మె చేయించి సాధించిందేమీలేదని గ్రహించిన కార్మికులు రియలైజై ఒకొక్కరూ డిపో మేనేజర్లకు డ్యూటీలో చేరుతామని దరఖాస్తు చేసుకుంటున్నారు. నగర ఆపరేషన్స్ నిర్వహించే గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో 29 డిపోలుండగా ఇందులో చాలా డిపోలకు కార్మికులు ఆదివారం ఉదయం నుంచే వచ్చారు. మరికొంతమంది మరో రెండ్రోజులు ఉంది కదా అని వేచిచూసే ధోరణితో ఉన్నా రు. నవంబర్ 5వ తేదీలోగా విధుల్లో చేరాలని కార్మికులను కాపాడుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పడంతో నమ్మిన కార్మికులు ముఖ్యమంత్రి మాటకు సై యూనియన్ నేతలకు నై చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ మజ్ధూర్ యూనియన్(టీఎంయూ), ఎంప్లాయీస్ యూనియన్(ఈ యూ) నేతల వ్యవహరంపై గుర్రుగా ఉన్న కార్మికులు నేతలతో ఇక అయ్యేదేమీలేదని గుర్తించా రు. టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ నేత ల ఏకపక్ష విధానాలు నచ్చని మిగతా సంఘాలు కూడా తమ యూనియన్ సభ్యులను సమ్మెకు వద్దు ఉద్యోగాల్లో చేరండని చెబుతున్నట్లు తెలిసింది.

సమ్మె కోసం జేఏసీగా ఏర్పడ్డ నాటి నుంచి చీలికవర్గం జేఏసీ సంఘాలు, నాయకులు సమ్మెకు మద్దతు తెలిపినప్పటికీ సభలు, సమావేశాల్లో మిగతా సంఘాలను కలుపుకుపోలేదు. దీంతో టీఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, సూపర్‌వైజర్స్ సంఘాలపై టీజేఎంయూ , ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు ఎప్పటికప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే జేఏసీలో టీఎంయూకు సంబంధించి అశ్వత్థామరెడ్డి మాత్రమే గుర్తింపు పొందడం మిగతా నాయకులతోపాటు మరో ముఖ్య సంఘమైన ఎంప్లాయీ స్ యూనియన్ నేత రాజిరెడ్డికి కనీస గుర్తింపు లభించకపోవడాన్ని ఈయూ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఐక్యత లేకపోవడంతోపాటు సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరితో కాపాడుకుంటామని ప్రకటన చేయడంతో విధు ల్లో చేరుతున్నారు. ఎన్నాళ్లు సమ్మెలో ఉన్నా విలీ నం సాధ్యం కాదని స్పష్టత ఇవ్వడం కూడా ఇక డిమాండ్లు పరిష్కారం కావని నిర్ణయానికి వచ్చి విధుల్లో చేరారు. సోమ, మంగళవారాల్లో పూర్తిస్థాయిలో విధుల్లో చేరే అవకాశముంది.

యూనియన్ల మేకపోతు గాంభీర్యం
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో కుదేలైన టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాలు మేకపోతు గాంభీర్యా న్ని ప్రదర్శిస్తున్నాయి. సమ్మె కొనసాగించడం సాధ్యంకాదని తెల్చినప్పటికీ సమ్మె కొనసాగిస్తామని ప్రకటన చేస్తున్నారు. కార్మికులు నెల రోజులుగా అష్టకష్టాలు పడుతున్నప్పటికీ పట్టించుకోకుండా ఉండటంతో ధైర్యంకోల్పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ విషయాన్ని యూనియన్ నేతలెవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని కార్మికులు గ్రహించారన్న విషయాన్ని తెలుసుకున్న సంఘాలు సమ్మెపై చేతులెత్తేసాయి. కొన్ని సంఘాలు అంతర్గతంగా తమ క్యాడర్‌కు విధుల్లో చేరాలని సూచనలు చేస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ సంఘాలు సమ్మె కొనసాగిస్తే కార్మికులకు నష్టమని గ్రహించి ఇక సమ్మె వద్దని చెబుతున్నాయి. ప్రధాన సంఘాలు కూడా సమ్మెను కొనసాగించడం ఇక కష్టమనే భావనకు వచ్చాయి. ముఖ్యమంత్రి ప్రకటన వల్ల కార్మికులు పూర్తిస్థాయిలో చేరే అవకాశముందని గ్రహించి నేడో,రేపో సమ్మె విరమించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే సూపర్‌వైజర్ అసోసియేషన్ దీనిపై సమావేశం ఏర్పాటు చేయ గా సమ్మె వద్దనే అభిప్రాయాలు ఎక్కువగా వచ్చినట్లు తెలిసింది.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...