ఈపీటీఆర్‌ఐలో పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ


Mon,November 4, 2019 02:35 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పర్యావరణం ప్రపంచాన్ని ఆందోళన కలిగిస్తున్న రంగం. వాతావరణ మార్పులతో యావత్తు పుడమి వణికిపోతున్నది. ఈ క్రమంలో పర్యావరణ నిర్వహణ ఇప్పుడు ఉపాధి కల్పన రంగంగానూ అవతరించింది. పర్యావరణ నిర్వహణ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇలా గచ్చిబౌలిలోని పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్‌ఐ)లో పలు కోర్సులను నిర్వహిస్తున్నారు. ఉచితంగా శిక్షణనందించే కోర్సుల్లో ప్రవేశాలకు సంస్థ అధికారులు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ సహాయంతో గ్రీన్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాంలో భాగంగా వీటిని నిర్వహిస్తున్నారు. ఈ కోర్సుల్లో చేరిన వారికి ఉచితంగా శిక్షణనివ్వడమే కాకుండా.. గచ్చిబౌలిలోని ఈపీటీఆర్‌ఐలో వసతిని సైతం కల్పించనున్నారు. ఆసక్తిగల వారు www.gsdp-evnis.gov.in/default3.aspz, [email protected] gmail. com, 040 -67567511,53,21 నంబర్లను సంప్రదించాలని సూచించారు

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...