ఉస్మానియాలో బెడ్ల తరలింపు


Mon,November 4, 2019 02:35 AM

సుల్తాన్‌బజార్ : పేదల ధర్మాసుపత్రిగా పేర్గాంచిన ఉస్మానియా దవాఖానాకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు దవాఖాన పాలకవర్గం నిరంతరం కృషి చేస్తున్నది. దీనిలో భాగంగానే దవాఖానలో పలు అభివృద్ధి పనులు చేపట్టిన విషయం విదితమే. దవాఖానలో రోగుల సంఖ్య పెరిగిపోతుండటంతో బెడ్ల సరిపోక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ రోగుల సంఖ్యకు అనుగుణంగా బెడ్లు పెంచాలనే లక్ష్యంతో విద్యార్థుల విశ్రాంత భవనంలో 60పడకల సామర్ధ్యం ఉండేలా మరమ్మత్తులు చేపట్టారు. నూతనంగా ప్రారంభించిన హౌస్ సర్జన్ క్వార్టర్స్‌కు ఏఎన్‌ఎస్‌సి నుంచి అదనంగా ఉన్న 20 బెడ్లను తరలించారు.సోమవారం పూర్థి స్థాయిలో తరలించేందుకు దవఖానా పాలక వర్గం విశేషంగా కృషి చేస్తుంది. ఇదిలా ఉండగా, పేట్లబుర్జు ప్రభుత్వ ప్రసూతి దవాఖాన మొదటి అంతస్తులో ఉస్మానియాకు కేటాయించడంతో దవాఖాన పాలక వర్గం ప్రసూతి దవాఖానను పరిశీలించారు. సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...