సేవలకు సన్మానం


Mon,November 4, 2019 02:34 AM

బేగంపేట్ : సాహిత్య కళా సేవా రంగాల మహా సమ్మేళనం ఆదివారం సికింద్రాబాద్ లయన్స్ క్లబ్‌లో జరిగింది. ఎన్‌జీవోస్ నెట్‌వర్క్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ తెలుగు పీపుల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలుగు రాష్ర్టాల్లో సాహిత్య, కళా, సేవా రంగాల్లో విశేష కృషి చేస్తున్న 200 స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఒకే వేదిక మీదకు తెచ్చి సన్మానించారు. ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ఒకరికి సేవ చేయాలని తపించే వారిని ఒక్క తాటిపైకి తెచ్చి వారిని సన్మానించడం అభిందనీయమన్నారు. ఎన్‌జీవో నెట్‌వర్క్ ప్రతినిధి లయన్స్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతిఒక్కరూ నేను అని ఆలోచిస్తున్నారు కానీ.. మనం అని ఆలోచించితే ప్రపంచం ఎంతో సంతోషంగా వృద్ధి చెందుతుందన్నారు. సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి బిక్కి కృష్ణ మాట్లాడుతూ సాహిత్య కళా, సేవా రంగాల ప్రతినిధులు మానవత్వానికి గౌరవ నీరాజనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తి బూర్గుల మధుసూదన్, జాతీయ ఉపాధ్యక్షులు లక్ష్మణ్, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ నాలేశ్వరం శంకర్, రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి పాల్గొన్నారు.

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...