నగరంలో ఆబ్కారీ దాడులు


Sun,November 3, 2019 02:00 AM

-వేర్వేరు చోట్ల ముగ్గురు అరెస్ట్.. 2.7కిలోల గంజాయి పట్టివేత
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గంజాయి విక్రయాలను అరికట్టే క్రమంలో హైదరాబాద్ ఆబ్కారీ డీటీఎఫ్ అధికారులు నగరంలోని పలు చోట్ల దాడులు జరిపారు. ఈ దాడుల్లో ధూల్‌పేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వేర్వేరు చోట్ల ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి 2.7కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డీటీఎఫ్ ఇన్‌స్పెక్టర్ కంచర్ల కరుణారెడ్డి కథనం ప్రకారం...అప్పర్ ధూల్‌పేట, బాబా బాలక్‌దాస్ మఠ్ ప్రాంతానికి చెందిన గుల్లుసింగ్, అర్జున్ సింగ్ గంజాయి విక్రయిస్తున్నారు. మరో కేసులో జిన్సీచౌరాయ్ ప్రాంతానికి చెందిన ఆకాశ్‌సింగ్ అతడి తండ్రి ముఖేష్‌సింగ్ గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న డీటీఎఫ్ బృందం నిందితుల నివాసాలపై దాడులు జరిపి.. 2.7కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఇన్‌స్పెక్టర్ కరుణారెడ్డి తెలిపారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...