వాహన దొంగలపై పీడీ యాక్ట్


Sun,November 3, 2019 01:59 AM

సైదాబాద్, నమస్తే తెలంగాణ : హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో బైక్‌లను తస్కరించిన ఇద్దరు యువకులపై సైదాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ ప్ర యోగించారు. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం... నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం, వంకేశ్వరం చెన్నంపల్లి తండాకు చెందిన వాడిత్యా చిన్న (22), ముడావత్ శ్రీను (21) బంధువులు. సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సింగరేణికాలనీ వాంబే క్వార్టర్స్‌లో నివసముంటూ.. బైక్‌లను దొంగిలిస్తున్నారు. గత జూన్‌లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై వచ్చిన ఇద్దరు నిందితులపై నగర సీపీ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ నమోదు చేశారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...