బైక్‌పై యువతిని ఎక్కించుకున్నందుకు దాడి నిందితుడు అరెస్ట్


Sun,November 3, 2019 01:59 AM

బంజారాహిల్స్, నమస్తే తెలంగాణ: యువతిని బైక్‌పై ఎక్కించుకున్నందుకు.. యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం..ఖైరతాబాద్‌లోని ఓ హాస్టల్‌లో నివాసం ఉంటూ ఎంబీఏ చదువుకుంటున్న సృజన (25) కడప జిల్లాకు చెందిన వ్యక్తితో ప్రేమలో ఉంది. ఇటీవల అతడి కోసం మతం మార్చుకుంది. త్వరలోనే పెండ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఫిలింనగర్‌లో నివాసం ఉంటున్న స్నేహితురాలిని కలిసేందుకు శనివారం సృజన వచ్చింది. అక్కడినుంచి స్నేహితురాలితో పాటు వరుణ్ అనే యువకుడి బైక్‌పై అమీర్‌పేటకు బయలుదేరింది. బురఖా ధరించిన సృజన వెనకసీట్లో కూర్చుంది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌వద్దకు రాగానే హసన్‌నగర్‌కు చెందిన అజర్ నవాజ్ (32) బైక్‌పై వచ్చి బురఖా వేసుకున్న యువతిని ఎందుకు ఎక్కించుకున్నావంటూ వరుణ్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో స్థానికం గా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంఘటనపై బాధితుడు వరుణ్‌తో పాటు యు వతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని నిందితుడు అజర్ నవాజ్‌ను అరెస్ట్ చేశారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...