ఆహ్లాదాన్ని పంచే కేంద్రంగా లుంబిని పార్క్


Sun,November 3, 2019 01:58 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హుస్సేన్‌సాగర తీరం నగరవాసులకు ఆహ్లాదం పంచుతున్న విడిది కేంద్రం. సెలవులు దొరికినా..కాస్త సమయం దొరికినా నగరవాసులతో పాటు పర్యాటకులకు హుస్సేన్‌సాగర్ తీరాలు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతున్నాయి. పిల్లలు, పెద్దలు ఇలా ఇంటిళ్లిపాది కోసం సరికొత్త వసతులతో సాగరతీరం మ రింతగా మైమరిపించబోతున్నది. బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఫుడ్‌కోర్టు, పార్టీస్ ఆర్ట్‌గ్యాలరీ, కాన్ఫరెన్సెస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫెసిలిటీలు, బడ్డింగ్ మ్యూజికల్ ఎంటర్‌ప్రెన్యూర్ సెంటర్‌లు ఏర్పాటు కాబోతున్నాయి. వీటి డిజైన్, ఇన్‌స్టాలేషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లైసెన్స్‌లు జారీ చేసేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు ఈ ప్రొక్యూర్‌మెంట్ టెండర్లను ఆహ్వానించారు. ఆసక్తి గలవారు ఈనెల 12 లోగా www.tender.telangana.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించి టెండర్లు దాఖలు చేయాలని కోరారు. ఐదేండ్ల కాల వ్యవధితో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చని వెల్లడించారు.
ఏర్పాటు చేసేవి..

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...