బేబీ మమతకు ఎలాంటి ప్రమాదంలేదు


Wed,October 23, 2019 01:17 AM

- అంకుర దవాఖానలో చికిత్స పొందుతున్న చిన్నారి

మేడిపల్లి : ఎల్బీనగర్‌లోని షైన్‌ దవాఖానలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన చిన్నారికి పీర్జాదిగూడలోని అంకుర దవాఖానలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నల్గొండ జల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన గిరి, మమత దంపతుల కూతురు బేబీ మమత(3 నెలలు)కు నిమోనియా రావడంతో ఆదివారం షైన్‌ దవాఖానలో చేర్పించారు. అదే రోజు దవాఖానలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐసీయూలో మంటలతోపాటు దట్టమైన పొగలు రావడంతో బేబీ అస్వస్థతకు గురి కావడంతో అంకుర దవాఖానకు తరలించినట్లు వైద్యులు తెలిపారు. బేబీకి ఎలాంటి గాయాలు కాలేదని, శ్వాస సమస్య ఉండడంతో దవాఖానలో చేర్పించారని తెలిపారు. చిన్నారి ఆరోగ్యం మెరుగ్గా ఉందని, ఇంకా 24గంటలు పరిశీలనలో ఉంచాలని దవాఖాన డాక్టర్లు సునీల్‌మోహన్‌, బాలాజీ తెలిపారు. బేబీ మమతకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.

విషమంగానే చిన్నారి పరిస్థితి
బంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ : ఎల్‌బీనగర్‌లోని షైన్‌ దవాఖానలో సోమవారం తెల్లవారు జామున జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని అంకురా దవాఖానలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నది. చంపాపేట ప్రాంతానికి చెందిన ముత్యాలు, సరిత దంపతుల 36 రోజుల వయస్సు గల పాప అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. చిన్నారిని బంజారాహిల్స్‌లోని అంకుర దవాఖానలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పాప పొట్ట భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, పాప పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...