మెట్రో స్టేషన్లు కిటకిట


Wed,October 23, 2019 01:15 AM

సిటీబ్యూరో, నమస్తే తె లంగాణ: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రికార్డుస్థా యి ప్రయాణికులతో హైదరాబాద్‌ మెట్రోరై లు కిటకిటలాడుతున్న ది. రోడ్డు రవాణాతో పోలిస్తే మెట్రో ప్రయా ణం సుఖవంతం, సౌకర్యవంతం కావడంతో ట్రాఫిక్‌ లేకుండా గమ్యస్థానాలకు చేరడానికి సులభంగా ఉందనే ఉద్దేశంతో చాలామంది నగర ప్రయాణికులు మెట్రో ప్రయాణంపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో మెట్రో స్టేషన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఒక్కో స్టేషన్‌ 10వేల నుంచి 25వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నది. ఆర్టీసీ సమ్మె మొదటిరోజు అక్టోబర్‌ 5న గత రికార్డులను అధిగమించి 3.65 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చి గతంలో ఉన్న రికార్డు 3.06 లక్షలను అధిగమించింది. ప్రతిరోజూ సగటున 2.7లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చే మెట్రోరైలు సమ్మె ప్రారంభమైన రోజు నుంచి తన సామార్థ్ధ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళ్తున్నది. సమ్మె నేపథ్యం లో ప్రభుత్వం ఆదేశాల మేరకు ట్రిప్పులను పెంచడంతోపాటు ఫ్రీక్వెన్సీనీ పెం చి 3 నిమిషాలకొక రైలును నడిపిస్తున్నారు.

ప్రయాణికులకు ఇబ్బంది లేకుం డా అదనపు కౌంటర్లు, సిబ్బంది ఏర్పాటు చేసి సేవలు అందించారు. అక్టోబర్‌ 5న 3.65 లక్షల మంది రికార్డు సాధించిన హైదరాబాద్‌ మెట్రోరైలు 10వ తేదీన 3.6 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. రద్దీ పెరుగుతుండటంతో పాకెట్‌ ట్రాక్‌ల్లో అదనపు రైళ్లు ఉంచుతూ రద్దీ ఉన్న ప్రాం తాల్లో నడిపారు. 14వ తేదీన గత రికార్డును తిరుగరాస్తూ 3.8 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చారు. ఒకొక్కరోజు రెగ్యులర్‌ ట్రిప్పులకు అదనంగా 100 ట్రిప్పుల వరకు నడిపించారు. అదేవిధంగా అక్టోబర్‌ 21న కార్యాలయాలు, విద్యాసంస్థలకు వెళ్లేవారితో కిటకిటలాడిన మెట్రోరైళ్లు 3.98 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి సరికొత్త రికార్డును సృష్టించారు. ఇసుక వేస్తే రాలనంత ప్రయాణికులతో ప్రతీస్టేషన్‌ కిటకిటలాడింది.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...