చీటికి మాటికి రోడ్లు తవ్వరు


Tue,October 22, 2019 05:52 AM

-సమన్వయ లోపాలకు చెల్లు
-సమగ్రమైన పద్ధతుల్లోనే ఇక రహదారుల నిర్వహణ
-వేర్వేరు పనులకు వేర్వేరు టెండర్ల పద్ధతికి స్వస్తి
-రోడ్లతోపాటు ఫుట్‌పాత్ నిర్మాణాలు, గ్రీనరీ వరకు అన్ని పనులూ ఒకే సంస్థకు అప్పగింత
-ఐదేండ్ల వరకు నిర్వహణ బాధ్యతలు
-సమీక్ష జరిపిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
-అత్యున్నత ప్రమాణాలతో రోడ్లే లక్ష్యంగా వినూత్న పద్ధతికి శ్రీకారం

శేరిలింగంపల్లి, అక్టోబర్ 21: పోలీసు అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని సేవలందించాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని సోమవారం గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో అమరవీరుల సేవలను స్మరిస్తూ అమరవీరుల స్మారక స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీస్ కానిస్టేబుల్ ఫహీముద్దీన్, సబ్ ఇన్‌స్పెక్టర్ హన్మంత్ రెడ్డి, ఏఆర్ పీసీ ఈశ్వర్ రావుల కుటుంబ సభ్యులనను సన్మానించారు. ఇటీవల అనారోగ్యం కారణంగా మృతి చెందిన 2012 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ అంజలయ్య కుటుంబ సభ్యులకు సహోద్యోగులు రూ.1.50 లక్షల చెక్కును సీపీ చేతుల మీదుగా అందజేశారు. పోలీసు వారోత్సవాల్లో భాగంగా పోలీసులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ రక్తదాన శిబిరం, ఓపెన్ హౌజ్, పాఠశాల, కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, పోలీసు సిబ్బందికి ఫ్రెండ్లీ పోలీసింగ్.. తదితర అంశాలపై పోటీలు నిర్వహించారు. విజేత సీపీ ప్రశంసా పత్రాలు, బహుమతులను అందజేశారు. అనంతరం సైబరాబాద్ పోలీస్ సిబ్బంది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి గచ్చిబౌలి సిగ్నల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్ రావు, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, వుమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, సైబరాబాద్ క్రైమ్స్ ఏడీసీపీ ఇందిర తదితరులు పాల్గొన్నారు

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...