బ్యాడ్మింటన్‌లో కవలల సత్తా..


Tue,October 22, 2019 05:42 AM

నేరేడ్‌మెట్ : శ్రిష్టి సింగ్ , షాగున్ సింగ్ కవలలు... ఓవైపు చదువులో రాణిస్తూనే మరోవైపు తమకిష్టమైన షటిల్ బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రొత్సాహంతో, కోచ్ హలావో మాధే సహకారంతో బ్యాడ్మింటన్ అండర్ 13 డబుల్స్ విభాగంలో పతకం సాధించారు. షటిల్ బ్యాడ్మింటన్‌లో ఎన్నో పతకాలు సాధించిన ఈ ట్వీన్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో పాల్గొనడమే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. ఒకే ఇంటి నుంచి అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో అర్హత సాధించడానికి చాన్స్ కొట్టేయడమే లక్ష్యంగా శ్రమిస్తూ భళా అనిపించుకుంటున్నారు. యాప్రాల్‌కు చెందిన కల్నల్ వికాశ్ సింగ్, ప్రీతి సింగ్‌ల ఆణిముత్యాలు. శ్రిష్టి సింగ్,షాగున్ సింగ్ యాప్రాల్‌లోని ఇండస్ యూనివర్షల్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నారు. గత మూడు రోజులుగా 5వ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గల్స్ బాచుపల్లి చేతన్ ఆనంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగాయి. రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ పోటీల్లో అండర్ 13 విభాగాల్లో డబుల్స్ చాంపియన్స్‌గా గెలుపొందారు. ఇటీవల ఉడిపి అండర్ 13లోకూడా ఫైనల్స్‌లో రన్నరప్ నిలిచారు. క్రీడారంగంలో తారలుగా వెలుగొందాలనే ఆశయంతో బ్యాడ్మింటన్‌ను నేర్చుకుంటున్నారు. ఇటు విద్య అటు తమకు ఇష్టమైన రంగంలో రాణించేందుకు శిక్షణ పొందుతున్నారు. చిన్న వయస్సులోనే స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు ఈ కవలలు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...