యోగాతో మానసిక ఒత్తిడి దూరం


Mon,October 21, 2019 12:07 AM

కవాడిగూడ: ఆత్మ, బుద్ధి, శరీర ఇంద్రియాలు మన ఆధీనంలో ఉంచుకుంటే మందుల అవసరమే ఉండదని అవధూత పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. అవధూత దత్తపీఠం ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ కళాభారతి(ఎన్టీఆర్‌స్టేడియం)లో బృహత్‌దత్త క్రియా యోగాశిబిరం నిర్వహించారు. వందలాది మంది భక్తులు శిబిరంలో పాల్గొన్నారు. ఓంకా రంతో కొద్దిసేపు ధ్యానం చేసిన అనంతరం యోగాసనాలు సాధన చేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ శారీరక ఆరోగ్యానికి, వ్యక్తిత్వ వికాసానికి యోగా ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. యోగాతో మానసిక ఒత్తిడి దూరమై ప్రశాంతత చేకూరుతుందన్నారు. యోగా, ప్రాణాయామం, ధ్యానం తో మన శరీరాన్ని, మనస్సును సరి చేసుకోవచ్చునని చెప్పారు. వీటిని సాధనతోనే మన పూర్వీకులు, మహర్షులు వందేండ్లకుపైగా ఆరోగ్యకర జీవనాన్ని సాగించారన్నారు. ఇకనుంచి దత్తక్రియా యోగా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...