ఎమోషన్స్‌పై జర్మనీ ఎగ్జిబిషన్


Mon,October 21, 2019 12:06 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గోతెఝంత్రం ఆధ్వర్యంలో సాలర్జ్జింగ్ మ్యూజియంలో నిర్వహిస్తున్న జర్మనీ ద పవర్ ఆఫ్ ఎమోషన్స్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. వందేండ్ల నుంచి ప్రస్తుతం వరకు జర్మనీ రాజకీయాల్లో ఎమోషన్స్ పాత్రపై సేకరించిన చిత్రాలను సందర్శనకు ఉంచారు. సంతోషం, బాధ, కోపం, ఆశ, భయం, నమ్మ కం, సిగ్గు, అత్యుత్సాహం, అసూయ, అహం కారం, వ్యామోహం, శోకం, సానుభూతి తదితర 20 రకాల ఎమోషన్స్‌తో గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ఎగ్జిబిషన్ ద్వారా వెల్లడించారు. రాజకీయాల్లో ఎమోషన్స్ చాలా క్రియాశీలక పాత్ర పోషించాయని చిత్రాలు సూచిస్తున్నాయి. ఈ ఎగ్జిబిషన్ ఈనెల 31 వర కు సందర్శనకు అందుబాటులో ఉంటుందని ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ జ్యోతి తెలిపారు. చారిత్రకారులు ఉట్, బెట్టిన ఫ్రెవెర్‌లు తల్లీకూతుళ్లు. వారు జర్మనీ రాజకీయాల్లో ఎమోషన్స్ పాత్రపై సేకరించిన సమాచారంతోనే ఎగ్జిబిషన్ ఏర్పా టు చేశారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...