గురుకుల విద్యార్థులు క్రీడల్లో రాణించాలి


Sun,October 20, 2019 03:22 AM

ఘట్‌కేసర్: గురుకులాల్లో చదివే విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించే విధంగా ఎదగాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల డిగ్రీ మహిళా కళాశాల సంయుక్త కార్యదర్శి ఎం.ప్రవీ ణ్ అన్నారు. ఘట్‌కేసర్ మం డలం అంకుశాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో 4వ రాష్ట్రస్థాయి క్రీడాపోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాచ్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. విద్యార్థులకు విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించే విధంగా గురుకుల కళాశాలలు తర్ఫీదునిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు అయ్యేఖర్చుకు వెనుకాడకుండా విద్యార్థులు చదువు పూర్తయ్యేనాటికి ఉన్నత విద్యనభ్యసించడం, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేసుకోవడం వంటి ఆశయంతో గురుకులాల డిగ్రీ విద్యసాగుతుందన్నారు. విద్యార్థులు క్రీడాపోటీల్లో పాల్గొని జిల్లా, రాష్ట్రస్థాయిల్లోనే కాకుండా జాతీ య, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే విధంగా కృషి చేయాలని కోరారు. ఒక విద్యార్థిని విద్యలో రాణించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందితే తన కుటుంబంతోపాటు మనదేశం అభివృద్ధి చెందినట్లేనని, ఇక్కడ చదువుతున్న విద్యార్థులు జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. కార్యక్రమంలో గురుకులాల డిప్యూటీ సెక్రటరీ ప్రమోద్‌కుమార్, ఎంపీపీ వై.సుదర్శన్‌రెడ్డి, ఓఎస్‌డీ బి.మారుతిరావు, కళాశాల ప్రన్సిపాల్ వి.అరుంధతి, స్థానిక ఎంపీటీసీ కె.శోభారాణి, ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, దాదాపు 30 కళాశాలలకు చెందిన 900మంది క్రీడాకారులు, 17 క్రీడాపోటీల్లో పాల్గొంటున్నట్లు మీడియా కన్వీనర్ మృదుల తెలిపారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...