రూ. 20కోట్లు ఇవ్వండి..


Sat,October 19, 2019 01:37 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌లోని ప్రభుత్వ శాఖల చూపులన్నీ ఇప్పుడు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ వైపు చూస్తున్నారు. ఆర్థికంగా ఆదుకోవాలంటూ అభ్యర్థిస్తున్నాయి. ఇందులో భాగంగానే మెట్రో రైల్ అధికారులు రూ. 50 కోట్లు మంజూరు చేయాలన్న వినతి మేరకు హెచ్‌ఎండీఏ అధికారులు స్పందించారు. మెట్రో రైల్‌కు సంబంధించిన ఆస్తులను (దాదాపు 8 ఎకరాలు) తనఖా పెట్టుకుని ఇప్పటికే రూ. 30 కోట్లు హెచ్‌ఎండీఏ అందజేసింది. ఈ క్రమంలోనే మిగిలిన రూ. 20 కోట్లు కేటాయించాలంటూ రెండు రోజుల క్రితం మెట్రో రైలు విభాగం హెచ్‌ఎండీఏకు లేఖ రాశారు. రూ.20కోట్లకు సంబంధించి ఆస్తులను తనఖా పెట్టుకొని మంజూరు చేసేందుకు హెచ్‌ఎండీఏ సమాయత్తమవుతున్నారు. ఇదే బాటలో జీహెచ్‌ఎంసీ సైతం హెచ్‌ఎండీఏను ఆశ్రయించింది. ఎస్‌ఆర్‌డీపీ పథకానికి నిధుల సమస్య ఉందంటూ ఇటీవల జీహెచ్‌ఎంసీ రూ.100 కోట్ల మేర సహాయాన్ని కోరింది.ఈ అభ్యర్థన ప్రస్తుతం పరిశీలనలో ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...