బల్దియా ఉద్యోగులకు వైద్యబీమా


Sat,October 19, 2019 01:36 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : బల్దియాలోని సుమారు ఐదున్నర వేలమంది పర్మినెంటు ఉద్యోగులకు వైద్యబీమా సౌకర్యాన్ని కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. అలాగే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రమాదబీమా సౌకర్యాన్నికల్పించనున్నారు. దీనికోసం అధికారులు, ఉద్యోగుల ప్రతినిధులతో రెండు కమిటీలను ఏర్పాటుచేశారు. ఇంతకాలం పర్మినెంటు ఉద్యోగులు తమ సొంతఖర్చుతో వైద్యం చేయించుకొని ఆ మొత్తాన్ని రీయింబర్స్ చేసుకునే సౌకర్యం పొందుతుండగా, ఇకుముందు వారు ఎటువంటి సొమ్ము చెల్లించకుండానే వైద్యసేవలు పొందేందుకు బీమా సౌకర్యం వీలు కల్పిస్తుందని అధికారులు తెలిపారు. దీనిపై వివిధ బీమా సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు వారు పేర్కొన్నారు. మరోవైపు, ఈనెల 31వ తేదీలోగా బీమా సౌకర్యంపై తమ సమ్మతి తెలియజేయాలని ఉద్యోగులను కోరారు. ఉద్యోగి, అతని కుటుంబంతోపాటు తల్లి, తండ్రి కలుపుకొని ఐదుగురు సభ్యులు (1+5) రూ.

మూడు నుంచి ఆరు లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు పొందే విధంగా ఈ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు ఎంతోకాలంగా తమకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని కోరుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా జీహెచ్‌ఎంసీ వారికి ఉచిత వైద్య సౌకర్యం కల్పించే దిశగా బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తుండడం విశేషం. దీంతోపాటు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సైతం యాక్సిడెంటల్ బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు కూడా ఏర్పాటుచేస్తున్నారు. ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. ఎనిమిది లక్షలు నష్ట పరిహారం అందించనున్నట్లు, పాక్షికంగా, శాశ్వతంగా వైకల్యం పొందినవారికి కూడా ఈ బీమా సౌకర్యం వర్తిస్తుందని అధికారులు చెప్పారు. దేనికి ఎంత చెల్లించాలనేది ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వారు వివరించారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...