అభివృద్ధికి పెద్దపీట సీఎస్‌ఆర్‌కు పలు పనులు అప్పగింత


Fri,October 18, 2019 04:08 AM

-బల్దియా స్థాయీసంఘం కీలక తీర్మానాలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన జీహెచ్‌ఎంసీ స్థాయీసంఘం సమావేశం సందర్భంగా గురువారం పలు కీలక తీర్మానాలు చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ(సీఎస్‌ఆర్)కు పెద్దపీట వేస్తూ పలు సెంట్రల్ మీడియన్‌లు, ట్రాఫిక్ ఐలాండ్‌ల నిర్వహణ బాధ్యతలు వారికి అప్పగించారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పదవీకాలం పొడిగింపు వంటి తీర్మానాలు చేశారు. వీటితోపాటు పలు అభివృద్ధి పనులకు కూడా ఆమోదం తెలిపారు.
స్థాయీ సంఘం ముఖ్య తీర్మానాలు..
-హయత్‌నగర్ సర్కిల్ ఫతుల్లగూడ కృష్ణానగర్ కాలనీ సర్వే నం.34లోని 22500 చదరపు మీటర్ల స్థలాన్ని డిజాస్టర్ రెస్పాన్స్‌ఫోర్స్ యార్డు ఏర్పాటుకు కేటాయింపు -శేరిలింగంపల్లి సర్కిల్‌లోని బొటానికల్ గార్డెన్-మజీద్‌బండ మార్గాన్ని రెండు కిలోమీటర్ల వరకు సెంట్రల్ మీడియన్, ట్రాఫిక్ ఐలాండ్‌ల నిర్వహణ బాధ్యత సీఎస్‌ఆర్ కింద మేసర్స్ చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు అప్పగింత -కొండాపూర్ కందికుంట చెరువులో సీఎస్‌ఆర్ కింద ఐన్‌ప్లాక్స్ వాటర్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 15కేఎల్‌డీ సామర్థ్యం గల నీటిశుద్ధి ప్లాంటు ఏర్పాటు -శేరిలింగంపల్లి సర్కిల్ మైండ్‌స్పేస్ జంక్షన్-గచ్చిబౌలి రోలింగ్ హిల్స్ వరకు సెంట్రల్ మీడియన్, ట్రాఫిక్ ఐలాండ్ నిర్వహణ సీఎస్‌ఆర్ కింద నిర్వహణకు అప్పగింత, ప్రకటనల బోర్డుల ఏర్పాటుకు అనుమతి
-హఫీజ్‌పేట్ మీదికుంట అభివృద్ధి, పరిరక్షణ బాధ్యతను సీఎస్‌ఆర్ కింద మేసర్స్ ఫౌంటేన్ హెడ్ గ్లోబల్ స్కూల్‌కు అప్పగింత -ఎస్‌ఆర్‌డీపీ పథకానికి రూపీ టర్మ్ లోన్ కింద రూ. 2500కోట్లు సమీకరణకు అరేంజర్‌గా ఎస్‌బీఐ క్యాప్స్‌ను 0.10శాతం ఫీజుపై నియామకం -జీహెచ్‌ఎంసీ పరిధిలోని బీఓటీ టాయిలెట్ల నిర్వహణ బాధ్యతను పదేళ్లపాటు సఫాయి కర్మచారీలకు కేటాయింపు. టెండర్లలో పాల్గొనే మేతర, వాల్మీకి వర్గాలకు చెందిన వారికి సెక్యూరిటీ ఫీజు డిపాజిట్‌ను రూ.50వేల నుంచి రూ. 20 వేలకు తగ్గింపు
-సఫాయి కర్మచారీలకు రూ.10వేలుగా ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజును రూ. ఐదు వేలకు తగ్గింపు -హయత్‌నగర్ సర్కిల్ ఫతుల్లగూడ డంప్‌యార్డువద్ద హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌లకు వేర్వేరుగా శ్మశానవాటికల నిర్మాణానికి రెండెకరాల చొప్పున భూమి కేటాయింపు -ఇబ్రహీంబాగ్ తారమతి బారాదరి రహదారి నుంచి పెద్ద చెరువు వరకు రూ. 3.90 కోట్లతో సివరేజీ డ్రెయిన్ నిర్మాణం.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...