ప్యారడైజ్ హోటల్‌కు లక్ష..


Fri,October 18, 2019 04:07 AM

సిటీబ్యూరో/బేగంపేట, నమస్తే తెలంగాణ : బిర్యానీకి ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ హోటల్‌కు గురువారం జీహెచ్‌ఎంసీ అధికారులు రూ. ఒక లక్ష జరిమానా విధించారు. వంటగది అపరిశుభ్రంగా ఉన్నట్లు, ఆహార పదార్థాలు నాణ్యతగా లేవని ఓ వినియోగదారుడి ద్వారా అందుకున్న ఫిర్యాదు మేరకు స్థానిక జీహెచ్‌ఎంసీ మెడికల్ ఆఫీసర్ హోటల్‌ను తనిఖీ చేసి జరిమానా విధించారు. సదరు వినియోగదారుడు బిర్యానీలో వెంట్రుకలు వచ్చినట్లు హోటల్ నిర్వాహకులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో అతడు హోటల్‌పై జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు తనిఖీలు నిర్వహించి నిల్వ ఉంచిన ఆహారం, అపరిశుభ్ర వంటగది తదితర అంశాలను గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా లక్ష జరిమానా విధిస్తూ మరోసారి తేడావస్తే హోటల్‌ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్యారడైజ్ హోటల్‌తోపాటు సాగర్‌రోడ్‌లోని కేఫ్ బహార్‌లో తనిఖీలు నిర్వహించిన జీహెచ్‌ఎంసీ అధికారులు అపరిశుభ్ర వంటగది, నాణ్యతలేని ఆహారాన్ని గుర్తించి రూ. లక్ష జరిమానా విధించారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...