భవన నిర్మాణ వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు


Fri,October 18, 2019 04:06 AM

ఉప్పల్, నమస్తే తెలంగాణ : నిబంధనలు పాటించని వ్యాపార, వాణిజ్య సంస్థలకు జీహెచ్‌ఎంసీ ఉప్పల్ సర్కిల్ అధికారులు జరిమానాలు విధిస్తున్నారు. ఈ మేరకు ఉప్పల్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం తనిఖీలు చేపట్టారు. హబ్సిగూడ ప్రధాన రహదారిలో భవన నిర్మాణ వ్యర్థాలను వేసిన యజమానికి రూ.50వేలు జరిమానా విధించారు. వీటితోపాటుగా హబ్సిగూడ, రామంతాపూర్ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకం, ట్రేడ్‌లైసెన్స్ లేని దుకాణాలు, ఫుట్‌పాత్ ఆక్రమణలు చేసే వారిపై జరిమానాలు వేశారు. ఉప్పల్ సర్కిల్‌లో గురువారం రూ.87వేల జరిమానాలు విధించినట్లు ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కృష్ణశేఖర్ తెలిపారు. నిబంధనలు పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. శానిటేషన్ సూపర్‌వైజర్ సుదర్శన్, జవాన్లు జగన్, నర్సింగ్, సిద్దిలింగం, దస్తగిరి, ఎల్లయ్య, ఆకుల సతీశ్, దయాకర్, భిక్షపతి పాల్గొన్నారు.

చందానగర్ సర్కిల్‌లో రూ.13.45లక్షలు..
చందానగర్, నమస్తే తెలంగాణ : చందానగర్ సర్కిల్ పరిధిలో చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేసే వారికి భారీ మొత్తంలో జరిమానా వేశారు. గురువారం సర్కిల్ పరిధిలోని మాదాపూర్ డివిజన్‌లో రూ.7.50 లక్షలు, మియాపూర్ డివిజన్‌లో లక్ష, హఫీజ్‌పేట్ డివిజన్‌లో రూ.3.50లక్షలు, చందానగర్ డివిజన్‌లో రూ.1.25 లక్షలు మొత్తం కలిపి రూ.13.45 లక్షలు వసూలు చేసినట్లు ఉపకమిషనర్ యాదగిరిరావు తెలిపారు. సర్కిల్ పరిశుభ్రతకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...