హోటళ్లలో అధికారుల తనిఖీలు


Fri,October 18, 2019 04:06 AM

చంపాపేట : ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని చంపాపేట డివిజన్ బైరామాల్‌గూడ సాగర్ రింగ్ రోడ్డు చౌరస్తా సమీపంలోని అలేఖ్య టవర్‌ను ఆనుకొని ఉన్న కేఫ్ బహార్ హోటల్‌లో గురువారం ఎల్బీనగర్ సర్కిల్ ఉపకమిషనర్ విజయకృష్ణ, ఏఎంహెచ్‌వో మల్లిఖార్జున్‌రావుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. హోటల్‌లోని ఆహార పదార్థాలు పరిశీలించగా అపరిశుభ్రంగా ఉన్నాయని, ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేసిన మటన్, చికెన్, చేపల మాంసంతోపాటు వివిధ రకాల ఆహార పదార్థాలను గుర్తించారు. కనీస నిబంధనలు పాటించకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న కేఫ్ బహార్ హోటల్ యజమాని దేవరాజు కిరణ్‌కు రూ.లక్ష జరిమానా విధించగా, అదే హోటల్‌పై ఎలాంటి అనుమతులు లేకుండా లాడ్జీని నిర్వహిస్తున్న విజయ్‌కుమార్‌కు రూ.50వేలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ సర్కిల్ ఉపకమిషనర్ విజయకృష్ణ మాట్లాడుతూ స్థానికుల ఫిర్యాదు మేరకు హోటల్‌ను తనిఖీ చేశామన్నారు. లాడ్జీకి ట్రెడ్ లైసెన్స్‌తోపాటు ఎలాంటి అనుమతులు కూడా లేవన్నారు. హోటల్‌కు, లాడ్జీకి కలిపి లక్షన్నర జరిమానా విధించారు. ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే హోటల్స్, వివిధ దుకాణాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అధికారులు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...