పెరుగుతున్న ఆర్టీసీ బస్సులు


Thu,October 17, 2019 12:33 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఆర్టీసీ సమ్మెకు ప్రభు త్వం చేపడుతున్న ప్రత్యామ్నాయ చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. పూర్తిస్థాయి బస్సు లు నడువాలని ఆదేశించడంతో అధికారులు వాటికి తగ్గట్లుగా చర్యలు చేపడుతున్నారు. ఆర్టీసీ, రవాణా శాఖ సంయుక్తాధ్వర్యంలో బస్సుల ఆపరేషన్స్ పెరుగుతున్నాయి. ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు సమ్మెలో ఉన్నప్పటికీ గ్రేటర్ ఆపరేషన్స్‌లో బస్సుల సంఖ్య క్రమేపీ పెరుగుతున్నది. ఏ ప్రయాణికుడు ఇబ్బందిపడకుండా ఉండాలని నిపుణులైన డ్రైవర్లను, తాత్కాలిక కండక్టర్లను నియమించుకుని బస్సులను అన్ని రూట్లలో నడుపుతున్నారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తుండటంతో వీటికి అవకాశం ఇవ్వకుండా ఉండటానికి టిమ్స్ యంత్రాలను కూడా అందచేసేందుకు సిద్ధమయ్యారు. డ్రైవర్లను తిప్పిపంపుతున్నారనే ఆరోపణలు రావడంతో వీరి నియామకానికి కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఒక్కో డిపోకు ఒక్కో ఆర్‌డీవోస్థాయి అధికారి నోడల్ అధికారుల పర్యవేక్షణలో ఐదుగురు ప్రత్యేకాధికారులు ప్రతీ డిపో ఆపరేషన్స్ నిర్వహిస్తారు. ఇప్పటికే నగరంలో 50శాతం ఆర్టీసీ బస్సులు నడుస్తుండగా కొద్ది రోజుల్లోనే 100శాతం బస్సులను రోడ్లపైకి తేవాలని నిర్ణయించారు. ఈమేరకు బుధవారం రవాణాశాఖ కార్యాలయం నుంచి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన 100 శాతం బస్సుల లక్ష్యాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు చేపట్టారు. గ్రేటర్ పరిధిలో 29 డిపోలుండగా 3519 బస్సులు రోడ్లపై ఉండేవి. వీటన్నింటిని గతంలో మాదిరిగా రోడ్డెక్కించాలని భావిస్తున్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...