నేడు, రేపు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్


Wed,October 16, 2019 12:38 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్ ప్రజల దాహార్తిలో ముఖ్య భూమిక పొషిస్తున్న గోదావరి జలాల సరఫరాలో రెండు రోజుల పాటు అంతరాయం ఏర్పడింది. నేడు(బుధవారం) నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటల పాటు నీటి సరఫరా ప్రక్రియ నిలిచిపోనుందని అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పథకం ఫ్యాకేజీ-13లో భాగంగా ఇరిగేషన్ శాఖ గ్రావిటీ కెనాల్ నిర్మాణం జరుగుతున్నది. గజ్వేల్ మండల పరిధిలోని కోడకండ్ల గ్రామం వద్ద నగరానికి వచ్చే గోదావరి 3000 ఎంఎం డయా ఎంఎస్ పైపులైన్ ఈ కెనాల్ నిర్మాణానికి అడ్డుగా వస్తున్నది. దీంతో ఈ భారీ పైపులైన్ ఇతర చోటికి మారుస్తున్న క్రమంలో ఇరిగేషన్ శాఖ విజ్ఞప్తి మేరకు జలమండలి అధికారులు 48 గంటల పాటు షట్‌డౌన్ ప్రకటించారు. ఈ నెల 16వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి 18వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు నీటి సరఫరా ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అభివృద్ధి పనుల్లో భాగంగా నీటి తరలింపులో అంతరాయం ఏర్పడిందని, ప్రభావిత ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...