మున్సిపాలిటీల్లో పారిశుధ్య ప్రణాళిక


Wed,October 16, 2019 12:37 AM

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : గ్రామ పంచాయతీల్లో చేపట్టిన 30 రోజుల ప్రణాళిక స్ఫూర్తితో మున్సిపాలిటీల్లోను పారిశుధ్య ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని రా్రష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం సచివాలయం నుంచి మున్సిపాలిటీల పారిశుధ్య ప్రణాళికపై మంత్రి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, సీడీఎంఏ శ్రీదేవి, జలమండలి ఎండీ దానకిశోర్‌తో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వివిధ అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి స్పందిస్తూ జిల్లాలో 13 మున్సిపాలిటీలు ఉన్నాయని, ప్రత్యేక యాక్షన్‌ప్లాన్‌ను రూపొందించి ప్రతి మున్సిపాలిటీలో డంపింగ్ యార్డులు, పార్కులను ఏర్పాటు చేశామని తెలిపారు. దమ్మాయిగూడ, ఘట్‌కేసర్‌లో స్థలాలను కేటాయించామని, మున్సిపాలిటీల్లోను హరితహారంను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. మున్సిపల్ నిధులతో పాటు దాతల నుంచి నిధులు సేకరించి ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నామని చెప్పారు. జిల్లాల్లో మహాప్రస్థానం ఏర్పాటు చేసే ఆలోచన ఉందని, వర్షాల వల్ల రోడ్లపై పడిన గుంతలను పూడుస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపాలిటీల అవసరం మేరకు చెత్త సేకరణ వాహనాలు కొనుగోలు చేస్తామని మంత్రికి తెలిపారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన కలెక్టర్ ఎంవీ రెడ్డి మున్సిపల్, స్పెషల్, టౌన్‌ప్లానింగ్ అధికారులు ఒక బృందంగా ఏర్పడి మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణ, గ్రీన్ ప్లానింగ్ పనులు చేపట్టాలన్నారు. దుండిగల్, నిజాంపేట రోడ్లుపూర్తిగా గుంతలుగా మారాయని, వెంటనే బీటీ మిక్స్‌తో మరమ్మతులు చేయించాలని సూచించారు. మున్సిపాలిటీల్లో మల్టీథీమ్ పార్కులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ విద్యాసాగర్, డీఆర్వో మధుకర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...