పారిశుధ్య కార్మికులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు ..


Wed,October 16, 2019 12:36 AM

మారేడ్‌పల్లి, అక్టోబర్ 15 : స్వాతంత్య్రం లభించి ఏడు దశాబ్దాల అనంతరం దేశంలో పారిశుధ్య కార్మికులకు సరైన గౌరవం సమాజంలో లభిస్తుందని జాతీయ సఫాయి కర్మచారీ చైర్మన్ మన్హర్ వాజీబాయి జాలా అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ హరిహర కళాభవన్ పారిశుధ్య కార్మికులకు అవగాహన, చైతన్య కార్యక్రమం, ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధితో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పారిశుధ్య కార్మికుల సంక్షేమం పట్ల తమ కమిషన్ చిత్త శుద్ధితో ఉందని, వారికి ఎటువంటి అన్యాయం జరిగితే తమ దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకంలో పారిశుధ్య కార్మికులకు కూడా అవకాశం కల్పించాలని, ప్రత్యేక గృహ నిర్మాణ పథకం అమలు చేయాలని ప్రభుత్వంతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జాతీయ సఫాయి కర్మచారీ కమిషన్ సభ్యుడు జగదీశ్ హీరామణి మాట్లాడుతూ.. నగర పరిశుభ్రతలో పాటు ప్లాస్టిక్ నిషేధ ఉద్యమంలో కూడా పాల్గొనాలని పారిశుధ్య కార్మికులకు పిలుపునిచ్చారు. హరిహర కళాభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్‌ను కమిషన్ చైర్మన్, సభ్యులు సందర్శించారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శంకరయ్య వారిని సన్మానించారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ చేపడుతున్న కార్యక్రమాలపై రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. పారిశుధ్య కార్మికులకు ఉత్తమ అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కమిషన్ ప్రిన్సిపల్ ప్రైవేటు సెక్రటరీ మహేంద్ర ప్రసాద్, కన్సల్టెంట్ పూరణ్ సింగ్, స్పెషల్ అదనపు కమిషనర్ సుజాతగుప్తా, హరిచందన, మమత, ముషారఫ్, విశ్వజిత్ కంపాటి, సందీప్ కుమార్‌షా, సిత్మ పట్నాయక్, కెనడీ, శృతి, శ్రీనివాస్‌రెడ్డి, శంకరయ్య, ఉప కమిషనర్లు కె.రవికుమార్, నళిని పద్మావతి ,రమేశ్ , రాం మూర్తి, సోమరాజు, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...