జాప్యం లేకుండా.. అనుమతి


Tue,October 15, 2019 03:59 AM

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఎలాంటి జాప్యం లేకుండా.. నూతన పరిశ్రమలకు అనుమతులను, ప్రభుత్వం అందించే రాయితీలను అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం డిస్ట్రిక్ ఇండస్ట్రీస్ ప్రమోషన్, టీఎస్‌ఐపాస్ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో నిర్వహించి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులను, వాటి అనుమతుల పురోగతిపై కలెక్టర్ మాట్లాడారు. నూతన పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి నిబంధనల మేరకు అనుమతులను జారీ చేయాలన్నారు. ప్రభుత్వ రాయితీలను సకాలంలో అందించి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలన్నారు. సబ్సిడీలు ఇచ్చేముందు చెక్‌లీస్టు ద్వారా రుణాలు తీసుకున్నవారి వివరాలను సేకరించి తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తున్నారా, లేదా అనేది పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో మేడ్చల్ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రవీందర్, డీఆర్‌డీఓ కౌటిల్య, ఇరిగేషన్ డీఈ మంజుల, ఆర్‌డీఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...