ప్లాస్టిక్ ఓ ప్రశ్నగా సాగర్‌లో తేలియాడగా..


Fri,October 11, 2019 03:43 AM

-మూడు లక్షల ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం
-185 చదరపు అడుగులు...140 పలకలు
-సోలార్ ప్యానెళ్లతో ఎల్‌ఈడీ వెలుగులు
-బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్
ఖైరతాబాద్: ప్లాస్టిక్.... నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న కాలుష్యం.....పెట్ బాటిళ్లు... డబ్బాలు.... గ్లాసులు..... ఇలా అనేక రూపాల్లో మానవాళిని కబళించేందుకు కోర లు చాచుకొని ఉంది. నదులు, సముద్రాలను కలుషితం చేస్తోంది. అంతర్జాతీయ సంస్థల సర్వే ప్రకారం మహాసముద్రాల తీరాల్లో నిత్యం 150 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. వేలాది సంవత్సరాల పాటు భూమిలో కలిసి పోకుండా నిరంతరం విషాన్ని పంచే ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలను జాగృతం చేసే కార్యక్రమాలను చేపట్టింది. భారతదేశంలోనూ ప్లాస్టిక్ మనిషి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నది. ఇక ప్లాస్టిక్‌ను నిషేధించి భూ ప్రపంచాన్ని కాపాడుతామంటూ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో స్టార్ట్ (St+art) ఇండియా ఫౌండేషన్ సం స్థ ముందుకు వచ్చింది. హుస్సేన్ సాగర్‌లో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ డిజైన్ వీక్ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా వినూత్న కళాకారుడు డాకు నేతృత్వంలో ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్‌ను ఏం చేద్దాం అనే తీరులో ప్రశ్న రూపంలో ప్లాస్టిక్ బాటిళ్లతో ఓ భారీ ఆకారాన్ని బుద్ధుని విగ్రహం సమీపంలో సాగర్‌లో ప్రతిష్ఠించారు.

డాకు ఎవరూ....
ఢిల్లీ రాజధానిలో జన్మించిన ఓ యువకుడి పేరే డా కు....సాధారణ కుటుంబలో జన్మించిన ఆ యువకుడు గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు. పలు ప్రముఖ యాడ్ కం పెనీల్లో పనిచేస్తూనే అర్ధరాత్రులు వీధుల్లో సంచరిస్తూ పర్యావరణం, కాలుష్యం తదితర అంశాలతో గ్రాఫిటీ పేయింటింగ్‌లు వేస్తూ ప్రజలను జాగృతం చేస్తూ వస్తున్నాడు. అర్ధరాత్రి ఎవరికి కనిపించకుండా పేయింట్లు వేయడం అతని ప్రత్యేకత. రాత్రులు వచ్చి తన పని తాను చేసుకూ పోతాడు. ఈ నేపథ్యంలో స్టార్ట్ ఫౌండేషన్ అతన్ని సంప్రదించి ప్లాస్టిక్ నుంచి భూమిని కాపాడేందుకు ఓ మంచి ఆర్ట్ తయారు చేయాలని కోరారు. దీంతో తన మదిలో ఈ అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రూపమే నేడు సాగర్‌లో తేలియాడుతున్న ప్లాస్టిక్ బాటిళ్ల రూపొందించిన ప్రశ్న.

తయారీ ఎలా...?
వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సుమారు 3లక్షల ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగించారు. సాగర్‌లోని గౌతమ బుద్ధుడి మండపం పక్కనే లోతుగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకున్నారు. 25 రోజుల పాటు ఆర్టిస్ట్ డాకు నేతృత్వంలో 50 మంది కార్మి కులు ఒక్కో ప్లాస్టిక్ బాటిళ్లను పేర్చారు. 140 పలుకల ఆకారంలో 185 చదరపు అడుగుల క్వచ్ఛన్ మార్కు రూపంలో భారీ ఆకృతిని రూపొందించారు. ఒక్కో పలక ఎనిమిది అడుగుల వరకు ఉం టుంది. వాటిపై 140 సోలార్ ప్యానెళ్లను అమర్చి వాటికి ఎల్‌ఈడీ లైట్లను అనుసంధానం చేశారు. దీంతో రాత్రి వేళలో ఆ దృశ్యం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది.

ఆశ్చర్యం వ్యక్తం చేసిన అధికారులు
ప్లాస్టిక్ బాటిళ్లతో రూపొందించిన ఈ అద్భుతమైన ఆకృతిని రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, జీహెచ్‌ఎంసీ సర్కిల్-17 డిప్యూటీ కమిషనర్ గీతారాధిక, ఏఎం ఓహెచ్ డాక్టర్ భార్గవ నారాయణ, బీవీ పాపారావుల బృందం సందర్శించింది. ఆర్టిస్టులతో కలిసి దాని తయారీ విశేషాలను తెలుసుకున్నారు.

బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్
మూడు లక్షల ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగించి అద్భుతమైన ఆకా రాన్ని రూపొందించడం అభినందనీయం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిత్యం టన్నుల కొద్ది పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ను ఏం చేద్దామంటూ ప్రశ్న ఆకారంలో హుస్సేన్ సాగర్‌లో ఆకృతిని ప్రతిష్టించడం హర్షనీయం. బెస్ట్ కాంప్లిమెంట్స్ టు స్టార్ట్ టీమ్.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...