హైవేపై..80 దాటొద్దు


Fri,October 11, 2019 03:32 AM

-అతి వేగం ప్రమాదకరం
-రాచకొండ ట్రాఫిక్ పోలీసుల సూచన
-పట్టికతో ప్రయాణికులకు అవగాహన
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైవేలు (జాతీయ, రాష్ట్ర రహదారులు).. ఓఆర్‌ఆర్‌లపై వందకు పై స్పీడ్ లిమిట్‌తో ప్రయాణిస్తే అతి తొందరగా గమ్యానికి చేరుకుంటారనే ఆలోచన ప్రతి వాహనదారుడిలో ఉంటుంది. ఆ వేగాన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్న చాలా మంది అందులో ఉండే రిస్క్‌ను ఎవరూ గుర్తించడం లేదు. దీంతో అతి వేగంతో జరిగే ప్రమాదాలు వాహనదారుల ప్రాణాలను సెకన్లలలో గాలిలో కలిపేస్తున్నాయి. ఇలా పలువురు వందకు మించి స్పీడుతో ప్రయాణించి ప్రమాదాలకు గురైన సంఘటనలపై విశ్లేషించిన రాచకొండ ట్రాఫిక్ పోలీసులు మరణం, గాయాల ముప్పు లేకుండా ప్రయాణించే వేగాన్ని 80 కిలోమీటర్లగా నిర్ణయించారు. ఇక వాహనంలోని స్పీడ్ కిలోమీటర్ రీడింగ్ 80 దాటితే కచ్చితంగా ప్రమాదమేనని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైవేలు, ఓఆర్‌ఆర్‌పై ప్రయాణించే వారికి అవగాహన కలిగేలా ఓ పట్టికను రూపొందించి రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని హైవేలు, ఓఆర్‌ఆర్‌కు దారి తీసే మార్గాల్లో ఏర్పాటు చేస్తున్నారు. 80 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించండి సురక్షితంగా గమ్యానికి చేరుకోండంటూ సూచిస్తున్నారు. రాచకొండ ట్రాఫిక్ పోలీసులు రూపొందించిన స్టే సేఫ్ పట్టికకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...