తందూరి, అలంకృతి రిసార్ట్స్‌కు రూ.10 వేలు జరిమానా


Fri,October 11, 2019 03:30 AM

శామీర్‌పేట : పారిశుధ్య నిర్వహణ, ఆహార పదార్థాల నిల్వను సహించేది లేదని తూంకుంట మున్సిపాలిటీ కమిషనర్ వాణిగర్దస్ అన్నారు. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని తందూరి, అలంకృతి రిసార్ట్స్‌లను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాణి మాట్లాడుతూ హోటల్స్, రిసార్ట్స్ పారిశుధ్యం, పార్కింగ్, హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బాధ్యతారాహిత్యం కనిపిస్తే చర్యలు తప్పవన్నారు. తందూరి రెస్టారెంట్‌లో మాంసాహారం నిల్వ, సెల్లార్‌లో వర్షపునీరు, లేబర్స్‌కు సరైన వసతులు కల్పించకపోవడం, ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడం, క్లీనింగ్ సరిగ్గా లేకపోవడంతో పాటు పక్కనే ఉన్న ప్లాట్‌లో చెత్తాచెదారం వేయడాన్ని గుర్తించడం జరిగిందన్నారు. మొదటి తప్పుగా భావించి హెచ్చరించి రూ.10 వేలు జరిమానా విధించడం జరిగిందన్నారు. అలంకృతి రిసార్ట్స్‌లో ఎక్కువ కాలంగా నిల్వ చేసిన మాంసాహారం, ఆహార పదార్థాలను గుర్తించి సీజ్ చేయడం జరిగిందన్నారు. హరితహారం, పారిశుధ్య కార్యక్రమాల్లో అలంకృతి రిసార్ట్స్ యాజమాన్యం తీసుకుంటున్న చర్యలను అభినందించి సోషల్ సర్వీస్ సెంటర్ నిర్వాహణకు సామాజిక బాధ్యతగా సహాయాన్ని అందించాలని కోరారు. తడి, పొడి చెత్త సేకరణలో మున్సిపాలిటీ నుంచి ట్రాక్టర్ సదుపాయం కల్పిస్తామన్నారు. ఆహార పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం వహించడంతో రూ.10 వేలు జరిమానా విధించడం జరిగిందన్నారు. బిల్ కలెక్టర్లు మహేశ్, అనిల్‌రెడ్డి, రాంరెడ్డి, బీమా, కృష్ణ, శానిటేషన్ సూపర్‌వైజర్ నరేశ్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...