విద్యతో పాటు సత్ప్రవర్తనను నేర్పించాలి : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి


Fri,October 11, 2019 03:29 AM

తెలుగుయూనివర్సిటీ, అక్టోబర్ 10 : విద్యతో పాటు సత్ప్రవర్తనను నేర్పించి భావిభారత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి సూచించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో గురువారం సాయంత్రం శారద ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన సాగిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయుల సేవలను గుర్తించి 80మందిని టీచర్స్ ఎక్సలెన్సీ అవార్డులతో ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు వృత్తి పట్ల అంకితభావంతో ఉండాలన్నారు. దేశంలో విద్యావ్యవస్థలో మార్పులు అవసరమన్నారు. ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య మాట్లాడుతూ ప్రశ్నించే విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేల ఉపాధ్యాయులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర జలమండలి కార్పొరేషన్ చైర్మన్ వి.ప్రకాశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల అధ్యాపకుల కృషిని గుర్తించి సన్మానించడం ముదావాహమన్నారు. కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యురాలు జీవిత, ప్రముఖ నటుడు రాజశేఖర్, సీనియర్ పాత్రికేయులు, జర్నలిస్టు సమాఖ్య అధ్యక్షులు మామిడి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles