భారతదేశ సంస్కృతి గొప్పది..


Thu,October 10, 2019 02:42 AM

చార్మినార్: భారతదేశ సంస్కృతి గొప్పదని, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అన్నారు. బుధవారం సాలార్‌జంగ్ మ్యూజియంలో నిఫ్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన షేర్వానీ ప్రదర్శనశాలను ఆయన మ్యూజియం డైరెక్టర్ నాగేందర్‌రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ప్రదర్శనశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో ఘనమైనవన్నారు. భారత్‌లో విభిన్న జాతుల వారు భిన్న సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ..దేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తున్నారన్నారు. చరిత్ర తెలుసుకునేందుకు అక్కడి సంస్కృతులను అధ్యాయనం చేయడంతోపాటు అయా ప్రాంతాల్లోని భాషా సంస్కృతులు, ధరించే వస్ర్తాధరణ సైతం ఆధారాలను అందిస్తాయని సాలార్‌జంగ్ మ్యూజియం డైరెక్టర్ నాగేందర్‌రెడ్డి తెలిపారు. మ్యూజియంలో ఏర్పాటు చేసిన షేర్వాణీ ప్రత్యేక ప్రదర్శనశాల ఈ నెల 13వ వరకు కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మ్యూజియం అధికారులు, నిఫ్ట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles