నేత్రపర్వంగా అమ్మవారి నిమజ్జనం


Thu,October 10, 2019 02:38 AM

ఖైరతాబాద్: ప్రపంచ ప్రసిద్ధి చెందిన గణేశుడి విగ్రహాన్ని ప్రతి ఏడాది వివిధ రూపాల్లో, రికార్డు స్థాయిలోప్రతిష్టిస్తున్న ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొన్నేండ్లుగా దేవీ శరన్నవరాత్రోత్సవాలు నిర్వహిస్తూ సుమారు 25 అడుగుల ఎత్తయిన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారు. అదే పరంపర కొనసాగింపుగా గణేశుడి మండపంలోనే దుర్గమ్మను ప్రతిష్టించారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి వివిధ అలంకరణలు చేశారు. బుధవారం నిమజ్జనోత్సవాలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలకరించిన ట్రాలీపై అమ్మవారి విగ్రహాన్ని ఉంచి శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్ర రాజ్‌దూత్ చౌరస్తా, లుంబినీ పార్కు మీదుగా ట్యాంక్‌బండ్ వద్దగల నిమజ్జన స్థలానికి చేరుకుంది. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్, కన్వీనర్ సందీప్ రాజ్, కార్యనిర్వాహక కార్యదర్శి సింగరి రాజ్‌కుమార్ నేతృత్వంలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...