టీఆర్‌ఎస్ పార్టీ మేడ్చల్ కార్యాలయ నిర్మాణ పనుల పరిశీలన టీఆర్‌ఎస్ పార


Tue,October 8, 2019 04:35 AM

దుండిగల్,నమస్తేతెలంగాణ:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండిమైసమ్మలో నిర్మిస్తున్న మేడ్చల్ జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్‌రాజు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ వైస్‌చైర్మన్ బొంగునూరి ప్రభాకర్‌రెడ్డితో కలిసి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు కొనసాగుతున్న తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అదే కార్యాలయ ఆవరణలో ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సైతం పరిశీలించారు. కాగా పది రోజుల్లో మంత్రి కేటీఆర్‌తో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మంత్రిసత్యనారాయణ, జగన్, యాదగిరి తదితర నేతలు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...