వ్యర్థాల నిర్వహణ అధ్యయనానికి ప్రత్యేక కమిటీ


Mon,October 7, 2019 04:56 AM

-ఆదేశాలు జారీచేసిన ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌పై ఇండోర్‌, మైసూర్‌ పట్టణాల్లో అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్‌,ఐపీఎస్‌ అధికారులతో ప్రత్యేక కమిటీ వేసింది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. శానిటేషన్‌ ప్రత్యేకాధికారి సుజాత గుప్త, జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ ముషారఫ్‌ ఫరూకీ(ఐఏఎస్‌), ట్రాన్స్‌పోర్టేషన్‌ అడిషనల్‌ కమిషనర్‌ విశ్వజిత్‌ కంపాటీ (ఐపీఎస్‌), గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ రవికిరణ్‌, జీహెచ్‌ఎంసీ ఎస్‌ఈ కోటేశ్వర్‌రావు, జీహెచ్‌ఎంసీ కమిటీకీ అపాయింట్‌ చేసిన మరో డిప్యూటీ కమిషనర్‌తోపాటు ఇద్దరు ఏఎంవోహెచ్‌లను సభ్యులుగా నియమిస్తూ కమిటీనీ ఏర్పాటు చేశారు. ఇండోర్‌, మైసూర్‌ పట్టణాలను కమిటీ అధ్యయనం చేసి అక్కడ చెత్త నిర్వహణ, చెత్త వాహనాల ట్రాన్స్‌పోర్టేషన్‌పై అధ్యయనం చేసి ఈ నెల 25న నివేదిక ఇవ్వాలని ఆర్వింద్‌కుమార్‌ ఆదేశించారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...