ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా చూడాలి


Mon,October 7, 2019 04:53 AM

మేడ్చల్‌ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. దసరా రద్దీని దృష్టిలో పెట్టుకుని వీలైనన్ని ఎక్కువ ప్రైవేటు సర్వీసులను నడుపాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రవాణా, ఆర్టీసీ, పోలీసు, రెవెన్యూ అధికారులతో కలెక్టర్‌ ఆదివారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా ఆర్టీసీ సమ్మె జరుగుతుందని, ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా పోలీసుల భద్రత నడుమ ఎక్కువ బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ సర్వీసులతోపాటు ప్రైవేటు బస్సులు, క్యాబ్‌ లు, క్యారేజీలు, సెవన్‌ సీటర్స్‌, అటోలను నడుపాలని, ప్రయాణికుల నుంచి నిర్ణీత చార్జీలను మాత్రమే వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిపోలు, కూడళ్ల వద్ద బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేటు రిజిస్టర్‌ డ్రైవర్లను, స్కూలు బస్సు డ్రైవర్లను, ఆరోగ్యవంతంగా ఉన్న రిటైర్డ్‌ ఆర్టీసీ డ్రైవర్ల సేవలను ఈ సమయంలో వినియోగించుకోవాలన్నారు. ప్రయాణిల భద్రతకు పెద్దపీట వేయాలని, పెట్రోలింగ్‌, ఎస్కార్ట్‌ సేవలపై ప్రధాన దృష్టి పెట్టాలన్నారు.

విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి, బస్సులకు సమ్మె పేరుతో ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బతుకమ్మ, దసరా పండుగలున్నప్పటికీ అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రజలు సురక్షిత ప్రయాణం చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ కె.విద్యాసాగర్‌, డీఆర్వో మధుకర్‌రెడ్డి, ఆర్డీవోలు లచ్చిరెడ్డి, మధుసూదన్‌, పోలీసు, ఆర్టీసీ, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...