వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి


Sun,October 6, 2019 03:01 AM

కేపీహెచ్‌బీ కాలనీ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెం దా రు. ఈ సంఘటనలు కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకు న్నాయి. సీఐ లక్ష్మీనారాయణ క థనం ప్రకారం... అనంతపురం జిల్లాకు చెంది న రెడ్డమ్మగారి ఆదిశేషారెడ్డి (33) నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం జేఎన్‌టీయూహెచ్ చౌరస్తా నుంచి హైటెక్ సిటీ వైపునకు వెళ్తుండగా.. ఫోరం మంజీరామాల్ ఎదురుగా నూతనంగా నిర్మించిన ైఫ్లెఓవర్ బ్రిడ్జి వద్ద బైక్ అదుపుతప్పి కింద పడి మృతి చెందాడు.

మరో ఘటనలో...
మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన బొల్లె దేవదాస్ (52) నిజాంపేట లో ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం నిజాంపేట చౌరస్తాలో బస్సుదిగి రోడ్డు దాటుతుండగా.. వెనుకనుంచి వచ్చిన ఆటో అతడిని ఢీ కొట్టింది. తీవ్ర గాయా లు కాగా.. స్థానిక ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొం దుతూ శనివారం మృతి చెందాడు. పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...